VSP: కూటమి ప్రభుత్వంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని MLC వరుదు కళ్యాణి అన్నారు. ఈ మేరకు ఆమె మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో మాట్లాడారు. మద్యం ఏరులై పారుతూ మహిళల తాళిబొట్లు తాకట్ల పెట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని విమర్శించారు. 2014లో చంద్రబాబు రూ.14,200 డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి హామీని విస్మరించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది'


