హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో ఢీకొని వృద్ధుడు మృతి

HNK: ఆటో ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ఎల్కతుర్తి మండలంలోని ఇందిరానగర్ బస్టాండ్ వద్ద, సిద్దిపేట-హనుమకొండ రహదారిపై చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన సలీం భాష (65) రోడ్డు దాటుతుండగా, భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఆటో కూలీలతో దామెర వైపు వెళ్తూ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.