HYD: రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జలమండలి ఓ ప్రకటనలో తెలిపింది. సింగూరు ప్రాజెక్టులోని పైపులైన్ మెయిన్ జంక్షన్ పనులు, ఫేజ్ నాలుగులోని పంపు హౌస్‌లో వాల్వుల మార్పిడి పనుల కారణంగా నీటి సరఫరా ఉండదన్నారు. రేపు ఉ.10 గంటల నుంచి మంగళవారం ఉ.10గంటల వరకు BHEL, MIG-1,2, రైల్ విహార్, చందానగర్, ISB, KPHB కాలనీలో అంతరాయం ఉండనుంది.
తెలంగాణ
రేపు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్


