హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వివాహ వేడుకకు హాజరైన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

ATP: ఆత్మకూరు మండలంలో మండల అధ్యక్షురాలు సుబ్బర హేమలత, మారుతి కుమార్ వివాహ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.