HNK: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదైంది. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు భీమదేవరపల్లి మండలం వంగర నుంచి డయల్-112కు కాల్ రావడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ కొండిపాముల పృథ్వీ పోలీసులను దూషిస్తూ చేతులతో నెట్టడంతో విధులకు ఆటంకం కలిగించినట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై దివ్య వెల్లడించారు.
తెలంగాణ
పోలీసుల విధులకు ఆటంకం.. వ్యక్తిపై కేసు


