WGL: ఆధార్ ధ్రువీకరణ, కొత్త గ్యాస్ కనెక్షన్లు, రుణాల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్న అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాయపర్తి ఎస్సై రాజేందర్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గ్యాస్ ఇప్పిస్తామని, బంగారం దోచుకునేందుకు మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
'మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


