హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రధాన రహదారిపై ప్రమాదకర గోతులు

KKD: గొల్లప్రోలు పట్టణంలోని ప్రధాన రహదారిపై ప్రమాదకరమైన గోతులు ఏర్పడ్డాయి. వర్షం కారణంగా గోతుల్లో నీరు నిలిచిపోవడంతో అవి కనిపించక రాత్రివేళ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదాలను నివారించేందుకు స్థానిక యువత రోడ్డుకు అడ్డంగా రాళ్లు ఏర్పాటు చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం కాలేదని స్థానికులు తెలిపారు.