హైదరాబాద్: 28°C
తెలంగాణ

హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

HYD: బీరంగూడలోని ఐడియల్ కిచెన్‌లో ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేశారు. వంటగది చిన్నగా, ఇరుకుగా ఉండటంతో పాటు సరిగా శుభ్రం చేయలేదని గుర్తించారు. పిండ్లు, చట్నీలను సరిగా నిల్వ చేయకపోవడం, ఆహారాన్ని మూత లేకుండా ఉంచడం గుర్తించారు. వాడుతున్న కృత్రిమ రంగులను అక్కడికక్కడే తొలగించారు. వైద్య పరీక్షలు, నీరు-ఆహార పరీక్షలకు సంబంధించిన రికార్డులు లేకపోవడంతో నోటీసు జారీ చేశారు.