హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోకవరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. ప్రత్యేక తనిఖీలు

E.G: గోకవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు ఎస్సై పవన్‌ కుమార్‌ తెలిపారు. రంపచోడవరం పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రజల భద్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.