హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పచ్చ చొక్కాలకు సీఐ అండ: గురవయ్య

TPT: పచ్చ చొక్కాలకు గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు అండగా వ్యవహరిస్తున్నారని వైసీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదురు గురవయ్య ఆరోపించారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అండతో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను సీఐ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. దళితులకు అండగా నిలవాల్సిన ఎమ్మెల్యే తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.