హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్మార్ట్ రేషన్ కార్డులపై బీజేపీ నేత అభ్యంతరం

KNR: స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ముద్రించకపోవడంపై జిల్లా పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శంకరపట్నం మండలంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం 5 కిలోల బియ్యం ఇస్తుండగా, రాష్ట్రం కిలో మాత్రమే అందిస్తోందని తెలిపారు.