హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెండేళ్ల నమ్మకం' ప్రచారానికి ఎమ్మెల్యే పిలుపు

BPT: చీరాల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాలకొండయ్య అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ వివరించే "2 ఏళ్ల నమ్మకం" ప్రచారాన్ని విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సూపర్‌ సిక్స్ హామీల అమలును ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సలగల రాజశేఖర్ పాల్గొన్నారు.