హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా కోసం రైతుల ధర్నా

VKB: యాప్‌తో పనిలేకుండా ఆధార్‌ కార్డుపై యూరియా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పెద్దేముల్ మండల రైతులు సంగారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్మార్ట్‌ఫోన్లు లేక బుకింగ్ చేసుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వచ్చే యూరియాను అందరికీ పంపిణీ చేస్తామని మండల వ్యవసాయాధికారి పవన్ ప్రీతం హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.