హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవనకొండ ఆసుపత్రిలో సిబ్బంది కొరత

KRNL: దేవనకొండ ఆసుపత్రిలో ఆదివారం ఒక్క స్టాఫ్‌ నర్సే విధులు నిర్వహించడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే అత్యవసర రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా పీహెచ్‌సీలో అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.