హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుమ్మలచెరువులో పర్యటించిన అన్నా

ప్రకాశం: తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఆదివారం వైసీపీ ఇంచార్జ్ అన్నా రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య పర్యటించాడు. పార్టీ బలోపేతం వంటి అంశాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల గురించి పార్టీ శ్రేణులతో చర్చించారు. అనంతరం గ్రామంలోని ఖాసీం స్వామి దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. వీరి వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు.