ASF: జైనూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను జిల్లా కలెక్టర్ హరిత ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
జైనూర్ కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్ హరిత


