NDL: బేతంచెర్ల మండలం రంగాపురంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ఆకుల శివకుమార్ (49) భార్య, కుమారుడితో గొడవపడ్డాడు. ఆగ్రహించిన కుమారుడు శరత్‌కుమార్ కట్టెతో తండ్రిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే శనివారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఇవాళ దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బేతంచెర్లలో తండ్రిని చంపిన కొడుకు


