NRML: తానూర్ మండలంలోని వాడోన గ్రామాన్ని కొండముచ్చులు వణికిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులపై విరుచుకుపడుతూ గాయపరుస్తుండటంతో ప్రజలు ఇంట్లోంచి బయటకు రావడానికే జంకుతున్నారు. నెల రోజులుగా ఈ తతంగం సాగుతున్నా ఫారెస్ట్ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమకు విముక్తి కల్పించాలని కోరారు.
తెలంగాణ
వాడోన ఊరిపై కొండముచ్చుల దాడి


