హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోతుల బెడదతో వాంకిడి వాసుల ఇబ్బందులు

ASF: వాంకిడి మండల కేంద్రంలో కోతుల బెడద తప్పడం లేదు. ప్రతి రోజు కోతులు గుంపులుగా ఇళ్లలోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆహారం కోసం ఇళ్లపైకి ఎక్కుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.