హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళకు తప్పిన పెను ప్రమాదం

విశాఖ యారాడ బీచ్‌లో మహిళకు ఆదివారం పెను ప్రమాదం తప్పింది. రైల్వే న్యూకాలనీకి చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు సముద్రంలో స్నానానికి దిగారు. అలల ఉధృతికి సూర్యలక్ష్మి (55) నీటిలో కొట్టుకుపోతుండగా బీచ్ లైఫ్‌గార్డులు కదిరి లావరాజ్, నొల్లి వీర్రాజు, చుట్టూరు శ్రీను, కదిరి వెంకటేష్ వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.