హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామంలోనే 'మీసేవ' సేవలు

ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటిలో మీసేవా కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ ప్రారంభించారు. ఇకపై ప్రజలందరూ ధ్రువపత్రాలు, ప్రభుత్వ పథకాల దరఖాస్తులు, ఇతర సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే సేవలు పొందవచ్చని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కేంద్రాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.