HNK: ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో ఆదివారం కోతులు గంటపాటు రోడ్డుపై హల్‌చల్ చేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. గుంపుగా వచ్చిన కోతులు రోడ్డుపై తిరుగుతూ ప్రజలను భయపెట్టడంతో కొంతసేపు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: దామెరలో కోతుల హల్‌చల్.. భయాందోళనలో గ్రామస్థులు


