హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉధృతమవుతున్న పబ్లిక్ స్కూల్ సాధన పోరాటం

MDK: వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలంటూ బస్టాండ్ చౌరస్తాలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 4వ రోజుకు చేరుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక యువకులు ఈ దీక్షల్లో పాల్గొని నిరసన తెలిపారు. మండల కేంద్రంలోనే పాఠశాల ఏర్పాటుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.