హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీ షీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ

NTR: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు నందిగామ టౌన్ పోలీసులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌లు, గతంలో నేరాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ పి. శ్రీను తెలిపారు. షీట్ హోల్డర్లను బైండోవర్ చేస్తున్నామని, ఎన్నికల సమయంలో గొడవలు, బెదిరింపులు, దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.