MDCL: ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో గల తలారి బస్తీలో పెను ప్రమాదం తప్పింది. బస్తీ నివాసి తలారి యాదగిరి (40), ఆయన కుమార్తె వైష్ణవి (13) ఇంట్లో పనులు చేసుకుంటున్న సమయంలో పైకప్పు నుంచి భారీగా సిమెంట్ పెచ్చులు ఆదివారం ఒక్కసారిగా వారి పై పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
కూలిన ఇంటి పైకప్పు పెచ్చులు


