హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన స్వామి వివేకానంద 5కే రన్

WGL: పర్వతగిరి మండలం కల్లెడలో నిర్వహించిన “స్వామి వివేకానంద రన్–కల్లెడ” 5కే పరుగు ఘనంగా ముగిసింది. ఆదివారం 5కే పరుగుల పోటీలో సుమారు 220 మంది పాల్గొన్నారు. విజేతలకు మెడల్స్‌, ప్రశంసాపత్రాలను సర్పంచ్‌ తక్కలపల్లి శ్రీనివాస్‌ , ఉపాధ్యాయులు అందజేశారు. యువతలో ఆరోగ్యం, దేశభక్తి, క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించారు.