హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ముపాళ్ల ఎస్సీ కాలనీలో ఘర్షణ

PLD: సత్తెనపల్లి(మం) ముపాళ్ల ఎస్సీ కాలనీలో పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. రెండు రోజుల క్రితం సోషల్ మీడియా గ్రూపులో ఇరు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.