హైదరాబాద్: 28°C
తెలంగాణ

తక్కువ తూకం.. ఎక్కువ లాభం

BDK: పాల్వంచ పట్టణంలోని చికెన్‌ సెంటర్లు, చేపల విక్రయ కేంద్రాల్లో కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తూనికల కాటాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో కొన్ని చోట్ల తూకం కాటాలు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యాపారుల పై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.