హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రౌడీషీటర్లకు సీఐ కౌన్సెలింగ్‌

కాకినాడ వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్లుగా నమోదైన వారు సత్ప్రవర్తనతో మెలగాలని సీఐ నాగదుర్గారావు హెచ్చరించారు. ఆదివారం రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిపించి రోడ్డుపైనే కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, గొడవలు, ఘర్షణలు, వివాదాలకు దిగితే జైలుకు పంపుతామని స్పష్టం చేశారు.