హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొమురవెల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

SDPT: జిల్లాలోని చేర్యాల(M) ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. వరుసగా హాలిడేస్ రావడంతో రద్దీ నెలకొంది. గంగరేణి చెట్టుకు ముడుపులు కట్టి తమ కోర్కెలు నెరవేరాలని కోరుకున్నారు. అనంతరం ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో తెలిపారు.