హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మల్కాపూర్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం

MDK: తూప్రాన్(M) మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 414 వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గ్రామ శివారులో చేపట్టారు. గ్రామం మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సుకు ఇబ్బందికరంగా మారిన చెట్ల కొమ్మలను తొలగించారు. ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తెలిపారు. ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.