హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వృద్ధ దంపతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

కోనసీమ: కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గోటేటి రామమూర్తి దయనీయ స్థితిపై మంత్రి లోకేష్ స్పందించడంతో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం వారిని పరామర్శించారు. అధికారులను అప్రమత్తం చేసి వైద్యం, తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇద్దరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.