కృష్ణా: సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి బంటుమిల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. లచ్చన్న చిత్రపటానికి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పూలమాలతో నివాళులు అర్పించారు. సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కులు, రైతుల సంక్షేమం కోసం లచ్చన్న చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ఆయన ఆశయాలు, స్ఫూర్తి మనందరికీ మార్గదర్శకం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
UPDATE: ఘనంగా గౌతు లచ్చన్న జయంతి


