హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గెలుపే లక్ష్యంగా పని చేయాలి: ఎమ్మెల్యే

కృష్ణా: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పిలుపునిచ్చారు. పెదపారుపూడి మండలంలోని వింజనంపాడు గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో సుమారు రూ. 350 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.