హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు పానగల్‌లో ప్రజావాణి కార్యక్రమం

WNP: ప్రభుత్వ ఆదేశాల మేరకు పానగల్ మండలంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గోవిందరావు తెలిపారు. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.