హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహానికి భూమిపూజ

RR: కేశంపేట మండల కేంద్రంలో సంఘసంస్కర్త, విద్యాదాత రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ నిర్వహించారు. మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు తలసాని రంగారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, పీఏసీఎస్ ఛైర్మన్, ఉపసర్పంచ్‌లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.