ASR: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డుంబ్రిగూడ మండలం కొర్ర గ్రామంలో మద్యానికి బానిసైన కామయ్య అనే వ్యక్తి తన భార్య కోమిలి(40)ని కర్రతో విచక్షణారహితంగా కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
భార్యను చంపిన భర్త


