PPM: గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయతీ ఉరిటి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. వర్షాలు కురిసిన ప్రతిసారీ మట్టి దారి బురదమయంగా మారడంతో గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారిందని గిరిజనులు తెలిపారు. రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బురద రోడ్డుతో గిరిజనుల అవస్థలు


