WGL: రాయపర్తి మండల కేంద్రంలో ఆదివారం కుక్క దాడిలో ఐదుగురు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి వనానికి వెళ్లే రహదారిలో నడుచుకుంటూ వెళ్తున్న వారిపై కుక్క విచక్షణరహితంగా దాడి చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో ఊర కుక్కల సంఖ్య పెరుగుతున్నా గ్రామపంచాయతీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ
కుక్కల స్వైర విహారం.. ఐదుగురికి గాయాలు..


