హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బోడ కాకరకాయలకు విపరీతమైన డిమాండ్

MNCL: వర్షాకాలంలో లభించే బోడ కాకరకాయలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అటవీ ప్రాంతాల్లో, చేన్లలో సహజంగా పండే ఈ కూరగాయ, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటంతో కొనుగోలుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. బెల్లంపల్లి బజార్ ఏరియాలో బోడ కాకరకాయలకు కిలో రూ.300 వరకు పలుకుతోంది. ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు.