ATP: ఎల్లనూరు మండల కేంద్రం పచ్చని వరి చేలతో కోస్తా ప్రాంతాన్ని తలపిస్తోంది. ఆదివారం ఉదయం ఎటు చూసినా భూమికి పచ్చటి రంగు వేసినట్లు అందమైన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు కళకళలాడుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మనోహరమైన పచ్చదనం స్థానికులతో పాటు అటుగా వెళ్లే ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్
పచ్చదనంతో మైమరపిస్తున్న ఎల్లనూరు


