హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుపై రాళ్లు.. రాకపోకలకు పాట్లు!

PPM: కొమరాడ మండలం తొడుము నుంచి కొట్టు గ్రామానికి వెళ్లే రహదారి అసంపూర్తి పనులతో అధ్వానంగా మారింది. రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో రాళ్లు పైకి తేలి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. వర్షం కురిసినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని గ్రామస్థులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి తారు రోడ్డు వేయాలని వారు అధికారులను కోరుతున్నారు.