హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూచిక బోర్డు లేక తేర్యాల గ్రామస్తుల అవస్థలు

BHNG: తెర్యాల గ్రామానికి వెళ్లే మార్గంలో సరైన సూచిక బోర్డు లేకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఉన్న సూచిక బోర్డు పూర్తిగా శిథిలావస్థకు చేరి, అక్షరాలు కనిపించకుండా పోయాయి. దీంతో గ్రామానికి కొత్తగా వచ్చే వారు దారి తెలుసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి స్పష్టమైన సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.