హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'

KMM: కామేపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సీఎం ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ధరావత్‌ సోమ్లాల్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మండల ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.