NLR: మనుబోలు వీరంపల్లి క్రాస్ రోడ్ సమీపంలో జూనియర్ కాలేజీ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బద్దెవోలు గ్రామానికి చెందిన తిన్నెలపూడి వెంకయ్య బైక్‌పై నెల్లూరు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడడంతో తీవ్రగాయాలయ్యాయి. హైవే మొబైల్ హెడ్ కానిస్టేబుళ్లు మస్తాన్, మహేశ్ ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు


