హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15,000 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 15,819 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం స్థిరంగా ఉండటంతో జూరాల జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది.