హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరి పంటల బీమాకు గడువు పొడిగింపు

E.G: వరి పంటల బీమా పథకంలో నమోదు చేసుకునేందుకు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు గోకవరం మండల వ్యవసాయ అధికారి పి. రాజేశ్వరి తెలిపారు. రైతులు ఎకరానికి రూ. 570 చెల్లించి వరి పంటకు బీమా చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత, రాబోయే ఎల్‌నినో పరిస్థితుల నుంచి పంటకు ఆర్థిక రక్షణ పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.