హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ'

ASR: ఈనెల 17వ తేదీన డుంబ్రిగుడ మండలంలోని గసభ సచివాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎంపీడీవో లాలం సీతయ్య శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్పెషల్ అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలను పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతుల రూపంలో సమర్పించాలన్నారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.