హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబులెన్స్‌లో ప్రసవం

SRD: ఝరాసంగం మండలం భోజ్‌నాయక్‌ తండాకు చెందిన ఉజాలకు శనివారం అర్ధరాత్రి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. దీంతో 108 సిబ్బంది వెంటనే తండాకు చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవం వచ్చింది. ఈఎంటీ సాయికుమార్‌ సమయస్ఫూర్తితో అంబులెన్స్‌లోనే ప్రసవం చేయించగా ఉజాల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.