హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మండపం వద్ద మహిళల కుంకుమార్చనలు

NLG: కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో శ్రావణమాసం మొదటి ఆదివారం సందర్భంగా మహిళలు అమ్మవారిని దర్శించుకొని పూజలు జరిపారు. కుంకుమ పూజ మండపం వద్ద అర్చకులు నాగోజు మల్లాచారి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి మహిళలచే కుంకుమార్చనలు జరిపించారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.